Site icon NTV Telugu

Lawyers Boycott Court : కోర్టు విధులను బహిష్కరించిన లాయర్లు.. స్పందించిన హైకోర్టు

New Project (49)

New Project (49)

Lawyers Boycott Court : న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రంలోని 14 బార్‌ అసోసియేషన్ల అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also:Buddha Venkanna: చంద్రబాబు ఆ సీటు నాకు ఇవ్వండి.. ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉంది

తమను కోర్టు విధుల నుంచి బహిష్కరించలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా విధులకు దూరంగా ఉండాలన్న రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విధుల బహిష్కరణ తీర్మానాలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని చెప్పారు. సంబంధిత బార్ అసోసియేషన్ల కార్యనిర్వాహక సంస్థలను విధుల నుంచి తొలగించాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు తాజాగా నిందితులకు నోటీసులు జారీ చేసింది.
Read Also:Man Kills Mother: భూమిని ఇవ్వడం లేదని తల్లి తలనరికి చంపిన కసాయి..

Exit mobile version