Site icon NTV Telugu

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు ఆమోదం

Agrigold

Agrigold

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు.. ఇవాళ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగగా.. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఆమోదం తెలిపింది కోర్టు.. ఎస్బీఐ వేలంలో 1401 చదరపు గజాల భూమిని రూ.22.45 కోట్లకు విజన్ ఎస్టేట్స్ దక్కించుకోగా.. అగ్రిగోల్డ్ కు విజన్ ఎస్టేట్స్ బినామీ కాదని హైకోర్టుకు తెలిపింది ఏపీ సీఐడీ.. వాస్తవ మార్కెట్ ధరకన్నా విజన్ ఎస్టేట్ తక్కువకు కోట్ చేసిందని పేర్కొంది సీఐడీ.. అయితే, వాస్తవ ధర కన్నా తక్కువేనని కోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వ, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం.. ఇప్పటికి 3 సార్లు వేలం వేసినా.. విజన్ ఎస్టేట్ మాత్రమే పాల్గొన్నట్టు ఎస్బీఐ పేర్కొంది.. కాగా, మూడుసార్లు వేలం నిర్వహినందున.. ఇంకా వేచి చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది హైకోర్టు.. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఎక్కువ ధరకు కొనేవారిని తీసుకురాలేక పోయిందని వ్యాఖ్యానించింది.. విజన్ ఎస్టేట్స్ కు భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Exit mobile version