NTV Telugu Site icon

ఆనంద‌య్య మందు పంపిణీపై హైకోర్టులో విచార‌ణ‌..

High Court

క‌రోనా క‌ల్లోలం స‌మ‌యంలో నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య పంపిణీ చేసిన క‌రోనా మందు.. ఎంతో మందికి న‌యం చేసింద‌ని చెబుతున్నారు.. అయితే, దీనిపై అధ్య‌య‌నం చేసేందుకు మందు పంపిణీని నిలిపివేసింది ప్ర‌భుత్వం.. ఓవైపు దీనిపై అధ్య‌య‌నం జ‌రుగుతుండ‌గా.. మ‌రోవైపు.. ఆనంద‌య్య క‌రోనా మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు హౌస్ మోష‌న్ పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి.. అయితే, ఆ రెండు పిటిషన్ల విచారణకు హైకోర్టు అనుమ‌తించింది.. ఈ నెల 27న విచారణ చేపట్టనుంది హైకోర్టు డివిజన్ బెంచ్.. కాగా, ప్రభుత్వం మందు పంపిణీకి ఖర్చులు, ఇతర సౌకర్యాలు కల్పించాల‌ని కోరారు పిటిషనర్లు, శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాల‌ని.. లోకాయుక్తా ఆదేశాల ప్రకారం మందు పంపిణి అపారని పోలీసులు చెబుతున్నారని లోకాయుక్తకి ఆ అధికారం లేద‌ని పిటిష‌న్ల‌లో పేర్కొన్నారు.. మందు పంపిణీ ఆపాలని అసలు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేద‌ని తెలిపారు.. ఏ ఆదేశాలు లేకుండా ఆపటం స‌రికాద‌.ఇ.. ఆర్డర్ ఇవ్వకుండా ఆనంద‌య్య‌ను ఆపటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింద‌న్నారు పిటిష‌న్లు.. మొత్తానికి ఆ రెండు పిటిష‌న్ల‌ను విచార‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది హైకోర్టు.. మ‌రి కోర్టులో వాద‌న‌లు ఎలా జ‌ర‌గ‌నున్నాయి.. ఎలాంటి నిర్ణ‌యం రానుంది అనేది తెలియాల్సి ఉంది. మ‌రోవైపు, ఇప్ప‌టికే ఆనంద‌య్య మందులో ఎలాంటి హానిక‌ర‌మైన ప‌దార్థాలు లేవ‌ని ఆయుష్ తేల్చింది.. కానీ, పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉంది.