High Alert in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైఅలర్ట్ కొనసాగుతుంది. రాష్ట్రంలో సుమారు 60 నుంచి 70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. కాగా, ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 32 మంది మావోలు పట్టుబడ్డారు. అలాగే, ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక, కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేయగా.. ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాలో మావోయిస్టుల కదిలికలపై ఫోకస్ పెట్టారు పోలీసులు.
Read Also: Hidma History: హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే..!
అయితే, పలు జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇందుకోసం పోలీసులు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మిగిలి ఉన్న మావోయిస్టుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక, తనిఖీలపై అధికారికంగా వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. కాగా, ఈ ఆపరేషన్ పూర్తి అయ్యాక పూర్తి సమాచారం తెలిపే అవకాశం ఉన్నట్లు టాక్.
