Site icon NTV Telugu

ఆనందయ్య మందు తయారీకి అడవి నుండి వనమూలికల తరలింపు

కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ కోసం వనమూలికలను ట్రాక్టర్ లలో తరలిస్తున్నారు. వేప,మామిడి,నేరుడు ఆకులు,జిల్లేడు పులును వెంకటాచలం అడవి ప్రాంతం నుంచి కృష్ణపట్నం పోర్టు కు తరలిస్తున్నారు. అయితే సోమవారం నుంచి మందు పంపిణీ చేయనుండగా.. దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆనందయ్య. ఇక ప్రస్తుతం కృష్ణ పట్నం గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. స్థానికులను తప్ప ఇతరుల్ని గ్రామంలోకి రానివ్వడం లేదు పోలీసులు. కృష్ణపట్నం పోర్టులో మందు తయారీలో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి అక్కడే వసతులు కల్పిస్తున్నారు. అయితే మందు పంపిణీ కోసం ఇప్పటివరకు ఎటువంటి ప్రణాళికలు అధికారులు వెల్లడించలేదు. మొదటగా ముత్తుకూరు మండలం సచివాలయంలోని వాలంటీర్ల ద్వారా మందు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Exit mobile version