Site icon NTV Telugu

పట్నం బాట పట్టిన జనం… విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్

సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. దీంతో స్వగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు పయనం అయ్యారు. సోమవారం నుంచి ఆఫీసులు తెరుచుకోవడంతో ఉద్యోగులు సొంతూళ్ల నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.

Read Also: పశువుల పండగలో విషాదం.. పొట్టేలుకు బదులు మనిషి బలి

సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల రాకపోకలు సోమవారం రెట్టింపు స్థాయిలో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ మార్గంలోనే 9 టోల్ చెల్లింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఫాస్టాగ్ ఫాస్టాగ్ విధానం అమలులో ఉండటంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.

Exit mobile version