NTV Telugu Site icon

తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు…

గ‌త కొన్ని రోజుల‌గా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  వాతావ‌ర‌ణంలో భారీ మార్పులు చోటు చేసుకోవ‌డంతో పాటుగా రుతుప‌వ‌నాలు చురుగ్గా సాగుతుండ‌టంతో వ‌ర్షాలు కురుస్తున్నాయి.  తెలంగాణ‌లోని నిజామాబాద్ లో అర్ధ‌రాత్రి నుంచి భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది.  ఈ వ‌ర్షానికి రోడ్లు, ప‌లు కాల‌నీలు జ‌ల‌మ‌యం అయ్యాయి.  ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది.  దీంతో వాగులు వంక‌లు, జ‌లాశ‌యాలు నిండుకుండ‌లా మారాయి.  ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  

Read: అమెజాన్ ప్రైమ్‌ లో ”టక్ జగదీష్”

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఎడ‌తెర‌పి లేకుండా వ‌ర్షం కురుస్తున్న‌ది.  తాడేప‌ల్లి గూడెం, పోల‌వ‌రం, గోపాల‌పురంలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.   ఇక ఇదిలా ఉంటే, వాయువ్య బంగాళాఖాతంలో ఈనెల 23 వ తేదీనాటికి అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది.  ఈ అప్ప‌పీడ‌న ప్ర‌భావంతో ఈరోజు, రేపు ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య‌గోదావ‌రి, కృష్ణ‌, గుంటూరు జిల్లాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ది.  ఒక‌టి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది.