NTV Telugu Site icon

Weather Report: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Weather Report

Weather Report

Weather Report: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ తీవ్ర అల్పపీడనం.. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండంగా మారిన తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణించే ఛాన్స్‌ ఉందని తెలిపింది. తీరం వెంబడి బలంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.

Traffic Diversion : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాలు, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈనెల 9, 10 తేదీల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. 4 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.