NTV Telugu Site icon

Weather Update: ఏపీలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

Heavy Rains

Heavy Rains

భారీవర్షాలు ఏపీ, తెలంగాణ వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిన్నటి పశ్చిమ మధ్య మరియు ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం , దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. 2022 అక్టోబర్ ,18వ తేదీ నాటికి ఉత్తర అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి పశ్చిమ మధ్య మరియు ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతం ఖాతం ప్రాంతములో 2022 అక్టోబర్ 20 నాటికి అల్పపీడన ప్రాంతంగా విస్తరించనుంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు అందచేసింది భారత వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ఇవాళ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఇవాళ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలుఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఇటు రాయలసీమలో ఇవాళ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Show comments