Site icon NTV Telugu

నెల్లూరులో దంచికొడుతున్న వాన

అల్పపీడనం,భారీవర్షాల కారణంగా నెల్లూరు జిల్లా తడిసిముద్దవుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలతో ప్రజలు అల్లాడుతున్నారు.నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి,సూళ్లూరుపేట,వేలాది గ్రామాల్లో ప్రజలు అసలు రోడ్ల పై నడవలేనంతగా ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. దీంతో రోడ్లు దారుణంగా పాడైపోయాయి. నెల్లూరు నగరంలో చాలా చోట్ల నీరు చేరి నిలిచిపోయింది. దీంతో వాహనాలు రోడ్ల పై తిరగలేక,అండర్ బ్రిడ్జిల కింద ఇరుక్కుపోతున్నాయి.

ప్రభుత్వం,అధికారులు తమ ఇక్కట్లు, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీవర్షాలు రైతులకు చేదుని మిగులుస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటల నష్టంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వందల కోట్ల నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు.

Exit mobile version