Rain in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. ద్రోణి బీహార్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగుతున్నది. మరోవైపు రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో బలహీన పడింది. వీటి ప్రభావంతో రాబోవు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: Zakir Naik: హిందువులు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు.. ఇస్లామిక్ బోధకుడి కీలక వ్యాఖ్యలు
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉందని.. బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశంఉంది.. బలమైన గాలులు గంటకు 30 -40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Read Also: Etela Rajender : ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉందా?
ఇక, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)వీచే అవకాశం ఉంది. అదే రేపు, ఎల్లుండి తేలిక పాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది పేర్కొంది వాతావరణశాఖ.. మరోవైపు రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశంఉంది.. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.. ఇక, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
