Site icon NTV Telugu

నెల్లూరును ముంచెత్తిన వాన.. ఎటుచూసినా వరదే!

ఎడతెరిపి లేని వానలు, వరదలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం అయింది. దీంతో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు రూరల్‌, ఇందుకూరుపేట తదితర మండలాల్లోని పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇళ్లను వారు పరిశీలించారు. గంగపట్నం ప్రాంతంలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్లు, ఇసుకమేట వేసిన వరిపొలాలు, కోతకు గురైన చెరువులు, ఇందుకూరుపేటలోని ముదివర్తిపాళెంలో నీట మునిగిన రాజుకాలనీని పరిశీలించారు.

Exit mobile version