NTV Telugu Site icon

Heat Wave: అలెర్ట్.. రేపు 14 మండలాల్లో తీవ్ర, 102 మండలాల్లో వడగాల్పులు..!

Heat Waves

Heat Waves

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.. పలు రాష్ట్రాలకు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ఇక, ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి.. రేపు 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది..

Read Also: Balineni Srinivasa Reddy: బాలినేని సంచలనం.. గెలిపించే బాధ్యత వాలంటీర్లదే..!

తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల విషయానికి వస్తే.. అల్లూరిసీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అడ్డతీగల మండలాలు, అనకాపల్లి జిల్లాలో నాతవరం, నర్సీపట్నం మండలాలు, కాకినాడ జిల్లాలో కోటనండూరు, పల్నాడు జిల్లాలో అమరావతి మండలం, పార్వతీపురంమన్యం జిల్లాలో భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు మండలాలు, విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ వెల్లడించారు. ఇక, వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల సంఖ్య పరిశీలిస్తే.. ఎన్టీఆర్ జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 12 మండలాలు, అనకాపల్లిలో 11 మండలాలు , పల్నాడులో 11 మండలాలు, వైఎస్ఆర్ జిల్లాలో 11 మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 8 మండలాలు.. మరికొన్ని చోట్ల కలిపి మొత్తం 102 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.