ఓ వైపు తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించగా.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని.. అవసరం అయితేనే బయటకు రండి అంటూ ఐఎండీ హెచ్చరించింది. ఐఎండీ సూచలన ప్రకారం రాబోవు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ సమయంలో.. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని.. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి వోఆర్‌ఎస్ , ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని సూచించారు.. ఇక, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Read Also: Gang War: సికింద్రాబాద్‌లో గ్యాంగ్ వార్.. కర్రలు, రాళ్లతో దాడి..
రేపు అనగా.. శనివారం పార్వతీపురంమన్యం 12, విజయనగరం 9, అనకాపల్లి 8, అల్లూరి సీతారామరాజు 6, కాకినాడ 3 మిగిలిన చోట్ల అక్కడక్కడ మొత్తం 41 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపుతాయని.. ఏప్రిల్ 23 నుంచి 26 వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ పేర్కొంది.. ఏప్రిల్ 23న అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా.. విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. పశ్చిమగోదావరి, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38°C-39°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించారు..
ఇక, 24వ తేదీన, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా.. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.. విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయి.. మరోవైపు 25న అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, నంద్యాల, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో 42°C-44°Cల వరకు ఉష్ణోగ్రతలు, కోనసీమ, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.
మరోవైపు.. ఏప్రిల్ 26వ తేదీ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా.. విశాఖపట్నం, అనకాపల్లి , కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
