న్యాయస్థానం నుంచి దేవస్థానం అని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, విజయవాడలోనే ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి ఎందుకు వెళ్లరని టీడీపీని ఉద్దెశించి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాయలసీమ వరకు ప్రయాణం చేసి ఏదో విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేయటానికి కుట్రలు చేయడం సరికాదన్నారు.
టీడీపీ ముందుండి ఇలాంటి చర్యలకు పూనుకోవటం దుర్మార్గమైన చర్య కాదా అని సజ్జల ప్రశ్నించారు. ఈ పాదయాత్రకు వెళ్తున్న సమయంలో సీమ వాసులు కూడా తమ ప్రాంత అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీస్తే బాధ్యత ఎవరిదని ఆయన అన్నారు. డబ్బులు, కులం ప్రభావం రాజకీయాల్లో ఉండకూడదనే కొత్త సంప్రదాయాన్ని జగన్ అనుసరిస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి కనుకనే బీజేపీకి 21 వేల ఓట్లు వచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
