NTV Telugu Site icon

Mulpuri Kalyani: టీడీపీ నేత ముల్పూరి కళ్యాణి అరెస్ట్.. ఖండించిన చంద్రబాబు

kalyani ganna

Collage Maker 10 Apr 2023 10 11 Am 4970

కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు మహిళ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని అదుపులోకి తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు..గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ,  వైసీపీ మధ్య జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన రెండు కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు కల్యాణి.
ముందస్తు బెయిల్ రాకపోవడంతో అప్పట్నుంచి అజ్ఞాతంలో ఉన్నారు కల్యాణి… హనుమాన్ జంక్షన్ లోని తన నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో కల్యాణిని అదుపులోకి తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమెని అదుపులోకి తీసుకునేందుకు ఇంట్లోకి వచ్చారు మహిళా పోలీసులు. కనీసం నైట్ డ్రెస్ లో ఉన్నానని, బట్టలు మార్చుకుని వస్తానని చెప్పినా మహిళా కానిస్టేబుళ్ళు ఆమె బెడ్ రూంలో ఉండడంతో వాగ్వాదం జరిగింది.

Read Also:RamNavami Flag Desecration: జంషెడ్‌పూర్‌లో అల్లర్లు.. రంగంలో దిగిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్

ఇదిలా ఉంటే తెలుగు మహిళా నేత కల్యాణి అరెస్టును ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణిపై తప్పుడు కేసు పెట్టారు. అంతే కాకుండా కళ్యాణి బెడ్ రూంలోకి చొరబడ్డారు. కళ్యాణిని ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం అన్నారు చంద్రబాబు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్య కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు అన్నారు.