Mulpuri Kalyani: టీడీపీ నేత ముల్పూరి కళ్యాణి అరెస్ట్.. ఖండించిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు మహిళ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని అదుపులోకి తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు..గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన రెండు కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు కల్యాణి.
ముందస్తు బెయిల్ రాకపోవడంతో అప్పట్నుంచి అజ్ఞాతంలో ఉన్నారు కల్యాణి… హనుమాన్ జంక్షన్ లోని తన నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో కల్యాణిని అదుపులోకి తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమెని అదుపులోకి తీసుకునేందుకు ఇంట్లోకి వచ్చారు మహిళా పోలీసులు. కనీసం నైట్ డ్రెస్ లో ఉన్నానని, బట్టలు మార్చుకుని వస్తానని చెప్పినా మహిళా కానిస్టేబుళ్ళు ఆమె బెడ్ రూంలో ఉండడంతో వాగ్వాదం జరిగింది.
Read Also:RamNavami Flag Desecration: జంషెడ్‌పూర్‌లో అల్లర్లు.. రంగంలో దిగిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
ఇదిలా ఉంటే తెలుగు మహిళా నేత కల్యాణి అరెస్టును ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణిపై తప్పుడు కేసు పెట్టారు. అంతే కాకుండా కళ్యాణి బెడ్ రూంలోకి చొరబడ్డారు. కళ్యాణిని ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం అన్నారు చంద్రబాబు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్య కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు అన్నారు.
తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణి పై తప్పుడు కేసు పెట్టిందే కాక…. బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కింద కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు! @APPOLICE100 pic.twitter.com/MSpqkQ8uJh
— N Chandrababu Naidu (@ncbn) April 10, 2023
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..