Site icon NTV Telugu

దయచేసి ఏపీని అలా చేయవద్దని మనవి : జీవీఎల్‌

ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి మోడీ సంకల్పం కనిపిస్తుంది బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఆగిపోయిన 6 రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయమని కేంద్ర రైల్వే మంత్రిని కోరానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో ముందుకు రావాలని, కొంత నిధులు కూడా కేటాయించాలని కోరుతున్నానన్నారు. రాష్టంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరానని, విశాఖపట్నం నుంచి వారాణసికి (స్పెషల్ ట్రైన్) “ప్రత్యేక రైలు” ఏర్పాటు చేయాలని కోరానని ఆయన వెల్లడించారు.

కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి ఇస్తామన్న ప్రత్యేక హోదాయే కావాలంటే ఆంధ్ర ప్రదేశ్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, దయచేసి ఏపీని అలా చేయవద్దని మనవి అని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదాకు మించిన ప్రయోజనాలు కలిగించే ప్రత్యేక ప్యాకేజీ ని మోడి ప్రభుత్వం ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ముందు ఒప్పుకున్న చంద్రబాబు తర్వాత ఏమైందో తిరస్కరించారని ఆయన విమర్శించారు.

Exit mobile version