NTV Telugu Site icon

Mansukh Mandaviya: ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ ఏపీలో చాలా బాగా పని చేస్తోంది

Mansukh Mandaviya

Mansukh Mandaviya

ఇవాళ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటించారు. విజయవాడలోని ఓల్డ్ జీజీహెచ్ లో క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంను ఆయన పరిశీలించారు. అనంతరం మంగళగిరి ఎయిమ్స్ సందర్శించారు. ఆరోగ్యకరమైన సమాజం దేశాన్ని సమృద్ధిగా మారుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో 10 రకాల టెస్టులు జరుగుతాయని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు.

Read Also: Damodar Raja Narasimha: సంగారెడ్డి లో దామోదర రాజనర్సింహ రెండో రోజు పర్యటన..

ఆసుపత్రులు కట్టినా డాక్టర్లు ఉండాలని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పుకొచ్చారు. 107,000 మెడికల్ సీట్లు దేశంలో ఉన్నాయి.. 3 నుంచీ 4 లక్షలు టెలి కన్సల్టేషన్లు దేశం అంతా జరుగుతున్నాయి.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోంది అని ఆయన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ ఏపీలో చాలా బాగా పని చేస్తోంది.. రాష్ట్ర మంత్రి విడుదల రజనీ మంచి పనులు చేయడానికి నా వద్దకు వస్తారు.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్ధాయి మద్దతు ఉంటుంది.. రాష్ట్రం ఆరోగ్య సేవలకు చేసే ఖర్చుకు నిధులు ఇవ్వడానికి కేంద్రం వెనుకాడదు అని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.