Minister Nadendla: గుంటూరు జిల్లాలోని తెనాలిలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో జనసేన కార్యకర్తలు, నాయకులతో కలిసి ముందస్తు భోగి వేడుకలలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. భోగిమంటలు వెలిగించి.. సంక్రాంతి పండుగకు అనేక ప్రాంతాల నుండి ప్రజలు రావడం సంతోషకరమన్నారు.
Read Also: Uber: డివైడర్ ను ఢీకొన్న ఉబర్ క్యాబ్.. ఐదు నెలల గర్భవతితో పాటు అమె తల్లికి తీవ్రగాయాలు
ఈ సందర్భాలు ఆయన మాట్లాడుతూ.. రైతాంగానికి గౌరవం దక్కేలా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్నారు. తెలుగు జాతి గర్వపడేలా సంక్రాంతి పండుగను ప్రజలు అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమానంగా ముందుకు తీసుకు వెళ్తోందని పేర్కొన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మంచి ధర రావాలని రైతుల సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.
