Minister Savitha: గుంటూరులో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మెగా డిఎస్సీ ఉచిత శిక్షణా తరగతులను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వం అని మరోకసారి నిరూపించిందన్నారు. ఉద్యోగ కల్పన, విద్యా కల్పన, పరిశ్రమల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నది కూటమి ప్రభుత్వం.. డిఎస్సీ నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేస్తామన్నారు. 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డిఎస్సీ కోచింగ్ సెంటర్స్ ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం తప్పిదాల మూలంగా విద్యార్థుల భవిష్యత్ ఇప్పట్టికే దెబ్బ తిన్నది అని మంత్రి సవిత పేర్కొన్నారు.
Read Also: Bhairathi Ranagal: త్వరలో తెలుగులో కన్నడ థ్రిల్లర్ “భైరతి రణగల్”
ఇక, వెనుకబడిన తరగతుల యువత కోసం ఉచిత స్టడీ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని మంత్రి సవిత చెప్పుకొచ్చారు. గత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు.. ప్రతి ఒక్కరికి అప్పుల భారం నెత్తిన మోపి తోక ముడిచి పారిపోయాడు అని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా ప్రధాన కేంద్రాల్లో డిఎస్సీ కోచింగ్ సెంటర్లు, ఆన్ లైన్ కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం.. కోచింగ్ సెంటర్లో పాల్గొనే విద్యార్థులు75 శాతం హాజరు పొందినవారికి స్టై ఫండ్ కూడా ఇస్తామన్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ తుంగలో తొక్కి వ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి సవిత వెల్లడించారు.