Site icon NTV Telugu

Home Minister Anita: పోలీసులకు కోటి రూపాయల వరకు బీమా కల్పించాం..

Anitha

Anitha

Home Minister Anita: గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో కొత్త సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారభించింది. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయం ప్రారంభిoచడం సంతోషంగా ఉందన్నారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. 2014లో సీఎం చంద్రబాబు అమరావతి ప్రారంభించారు.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉందని మంత్రి అనిత పేర్కొన్నారు.

Read Also: Kerala State Film Awards 2025 : 10 అవార్డులు దక్కించుకుని సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం..

అయితే, రాజధాని కోసం రైతులు భూములు త్యాగం చెయ్యడం గొప్ప విషయం అని వంగలపూడి అనిత తెలిపింది. అమరావతి రైతుల కష్టం.. ప్రతి ఫలమే ఇవాళ అందరూ చూస్తున్నారు.. ఈ బిల్డింగ్ పూర్తి చెయ్యడానికి ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ మురళీ కృష్ణ చాలా కృషి చేశారని గుర్తు చేసింది. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు డీజీపీ కృషి చేస్తున్నారు.. పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.. పోలీసులకు కోటి రూపాయలు వరకు భీమా కల్పించాం అని వెల్లడించింది. కల్పిత వీడియోల ద్వారా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు.. అలాంటి వాటిని సమర్ధవంతంగా ఏపీ పోలీసులు ఎదుర్కొంటున్నారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చింది.

Read Also: Three Major Road Accidents: “డేంజర్ 19”.. ఈ ఏడాదిలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. అన్నింటిలో మృతుల సంఖ్య సేమ్..!

ఇక, ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ లో లారీపై రాళ్లు వేసిన వీడియో.. ఏపీలో జరిగినట్లు వైసీపీ ప్రచారం చేసిందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొనింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా ఏపీ పోలీసులు ఎదుర్కొన్నారు.. టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు వార్తలు స్ప్రెడ్ కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు.. కూటమి ప్రభుత్వం వచ్చాకే 6 వేల100 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం.. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు.. చనిపోయిన పోలీసు కుటుంబానికి అండగా ఉంటాం.. బీమా ద్వారా కనిష్టంగా రూ. 15 లక్షలు ఇవ్వడం జరుగుతుంది.. ఈ సబ్ డివిజన్ లో సిబ్బంది కొరత ఉంది.. త్వరలో అన్నీ భర్తీ చేస్తామని వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.

Exit mobile version