NTV Telugu Site icon

Man Cheated 30 Women: నిత్య పెళ్లికొడుకు అరెస్ట్.. 30 మందిని మోసం చేశాడు

Man Cheated Woman

Man Cheated Woman

Guntur Man Cheated 30 Women In The Name Of Marriage: అతడు చూడ్డానికి చాలా అమాయకుడిగా, బుద్ధిమంతుడిలాగా కనిపిస్తాడు. అందరితోనూ మంచిగా ప్రవర్తిస్తాడు. మరీ ముఖ్యంగా.. మహిళల పట్ల గౌరవంగా ఉంటాడు. ఇది చూసే మహిళలు అతని బుట్టలో పడేవాళ్లు. తన ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వడంతో.. మంచితనాన్ని అస్త్రంగా మార్చుకొని 30 మంది మహిళల్ని తన వలలో వేసుకున్నాడు. అందునా.. రెండో పెళ్లి చేసుకునే వారినే టార్గెట్ చేసేవాడు. ఎమోషనల్‌గా వారికి దగ్గరై, పెళ్లి పేరుతో మహిళల్ని మోసం చేశాడు. చివరికి.. ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో, ఆ నిత్యకొడుకు బండారం బట్టబయలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Rajasthan Royals vs Punjab Kings: టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్

గుంటూరు చెందిన సుదర్శన్ రావు అనే వ్యక్తి, కొంతకాలం క్రితం షాదీ డాట్ కామ్ ద్వారా ఒక మహిళను కలిశాడు. ఆమె అప్పటికే పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకుంది. తోడు కోసం వెతుకుతున్న క్రమంలో.. షాదీ డాట్ కామ్‌లో సుదర్శన్ రావు పరిచయం అయ్యాడు. తాను ఆర్మీ కమాండర్‌నంటూ పరిచయం చేసుకున్నాడు. తనకు చాలా ఆస్తులున్నాయని, రెండో పెళ్లి అయినా చేసుకోవడానికి సిద్ధమేనని ఆ మహిళను నమ్మించాడు. పాపం.. అప్పటికే జీవితంలో ఒకసారి దెబ్బతిన్న ఆమె, అతడ్ని పూర్తిగా నమ్మింది. తనకు సరైన తోడు దొరికాడని ఆనందించింది. కానీ, ఇంతలోనే అతని నిజస్వరూపం తెలిసి ఒక్కసారిగా ఖంగుతింది. పెళ్లి పేరుతో తనని మోసం చేస్తున్నాడని గ్రహించి, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Rajashekar: జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి.. మా అమ్మానాన్నల ముందు..

ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా.. మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అతడు ఇంతకుముందు 30 మంది మహిళల్ని మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. రెండో పెళ్లి చేసుకోవడానికి షాదీ డాట్ కామ్‌లో అప్లై చేసుకున్నవారినే సుదర్శన్ టార్గెట్ చేసేవాడని తేల్చారు. ఎమోషనల్‌గా వారికి దగ్గరై, పెళ్లి పేరుతో వారిని మోసం చేశాడని వెల్లడైంది. ప్రస్తుతం అతడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.