Site icon NTV Telugu

Posani Krishna Murali Case: థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? పోసానిని ప్రశ్నించిన జడ్జి

Posani

Posani

Posani Krishna Murali Case: థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ప్రశ్నించారు గుంటూరు కోర్టు న్యాయమూర్తి.. సీఐడీ విచారణపై పోసానిని ప్రశ్నించారు గుంటూరు కోర్టు జడ్జి.. విచారణ సక్రమంగా జరిగిందా? థర్డ్ డిగ్రీ వాడారా? అని ప్రశ్నించగా.. జడ్జి ప్రశ్నలకు సమాధానమిచ్చిన పోసాని.. థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు, లాయర్ల సమక్షంలోనే విచారణ జరిగిందని తెలిపారు.. ఇక, గుంటూరు కోర్టులో విచారణ ముగిసిన తర్వాత.. గుంటూరు సబ్ జైల్‌కు పోసాని కృష్ణమురళిని తరలించారు పోలీసులు..

Read Also: Sanju Samson: గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన ఆర్ఆర్ కెప్టెన్..

కాగా, పోసాని కృష్ణ మురళిని సీఐడీ పోలీసులు ప్రశ్నించారు.. నాలుగు గంటలపాటు పోసానిని విచారించారు పోలీసులు.. విచారణలో అనేక అంశాలపై పోసాని ప్రశ్నించారు.. అయితే, సమయం సరిపోకపోవడంతో మరోసారి పోలీసుల విచారణకు అడిగే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు, పోసాని కృష్ణమురళి పై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.. అయితే, సీఐడీ పోలీసుల విచారణ అనంతరం మరో సారి గుంటూరు జీజీహెచ్‌కు పోసాని కృష్ణ మురళిని తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించారు.. వైద్య పరీక్షలు అనంతరం పోసానిని గుంటూరు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో హాజరు పరిచారు సీఐడీ పోలీసులు..

Exit mobile version