Attack on Ambati Rambabu House: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి.. ఎమ్మెల్యే, ఆమె భర్త సహా 31 మందిపై కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on Ambati Rambabu House: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు తన న్యాయవాది ద్వారా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దాని ఆధారంగా మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులో టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తన నివాసంపై దాడి చేసి కార్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పట్టాభిపురం పోలీసులు BNS సెక్షన్లు 127(2), 189(2), 324(4), 329(4), 351(2) r/w 190 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాడి ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు, సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు.
Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ఇక, మరోవైపు, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ నల్లపాడు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబుపై పలు కేసులు నమోదయ్యాయి. కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతిస్తే, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబును విచారణ నిమిత్తం నల్లపాడు పోలీసులు గుంటూరుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.
తాజావార్తలు
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!