NTV Telugu Site icon

Sheikh Mallika: వికటించిన వశీకరణం.. ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో..!

Mallika

Mallika

గుంటూరులో నివాసం ఉండే షేక్ మల్లిక సొంతూరు పెదకాకాని మండలం నంబూరు గ్రామం. పదేళ్ళ క్రితం అదే గ్రామానికే చెందిన అక్బర్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం కూడా ఉన్నారు. ఆ తర్వాత గ్రామానికే చెందిన ప్రేమ్ కుమార్‌తో మల్లిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అక్బర్‌కు తెలియడంతో అతనితో విడాకులు తీసుకొని పిల్లలను వదిలేసి ప్రేమ్ కుమార్‌తో గుంటూరు వచ్చేసింది. ప్రేమ్ కుమార్‌ను వివాహం చేసుకొని గుంటూరులో కాపురం పెట్టింది. రెండో భర్తతో కూడా మల్లిక సరిగా లేదు. అలా ఉంటే ఆమె మల్లిక ఎలా అవుతుంది. ఆమె జీవితం ఎప్పుడో గాడి తప్పింది. 2021లో ఆమెకు పత్తిపాడుకు చెందిన నగల వ్యాపారి షేక్ అబ్దుల్ రెహమన్ తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. ఓ వైపు భర్త ప్రేమ్ కుమార్‌తో కాపురం చేస్తూనే.. షేక్ అబ్దుల్ రెహమన్ తో అక్రమ సంబంధం నడిపింది. కొన్నాళ్లకు ఆమెకు షేక్ అబ్దుల్ రెహమన్ కూడా బోర్ కొట్టినట్టున్నాడు. సరిగ్గా 9 నెలల క్రితం అతన్ని దూరంగా పెట్టింది. భర్త ప్రేమ్ కుమార్ తో కలిసి కాపురం నంబూరుకు మార్చింది. అక్కడ నాగబాబు అనే మరొకరితో సంబంధం పెట్టుకుంది.

CM Revanth Reddy : మంచినీటి సరఫరాపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు

ఇలా జీవితమంతా పెంట చేసుకున్న మల్లిక.. డిసెంబర్ 28న సాయంత్రం నంబూరులోని తన ఇంట్లోనే శవమై కనిపించింది. బెడ్రూంలోని తన బెడ్ పై విగతజీవిగా పడి ఉంది. ఏదో జరిగుంటుందని అనుమానించిన పోలీసులు.. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 28న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ మల్లిక ఇంటికి ఎవరెవరూ వచ్చారు.. అనేది ఆరా తీశారు. చుట్టు పక్కల ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. 28న మధ్యాహ్నం 2 గంటల సమయంలో మల్లిక ఇంటి దగ్గరకు బైక్ పై ముగ్గురు వచ్చినట్లు గుర్తించారు. వారు ఎవరు అనేది గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు ఆ ముగ్గురిని గుర్తించారు. ఆ ముగ్గురిలో ఒకరు మహిళ.. ఆమె పేరు మానిపాటి స్వప్న.. గుంటూరులోని సుద్దపల్లికి చెందిన మానిపాటి స్వప్న.. మరొకరు షేక్ జనాబ్ అహ్మద్. అతడికి గుంటూరులో మంత్రగాడిగా మస్త్ పేరు ఉంది. ఇంకొకరు అతని అనుచరుడు ప్రకాశం జిల్లా కట్టకిందపల్లికి చెందిన ఖాజా రసూల్. అయితే.. ఈ ముగ్గురికి మల్లికను చంపాల్సిన అవసరమేంటి.. వారిని పట్టుకుని విచారించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. మల్లిక జల్సాలకు అలవాటు పడిందని.. లగ్జరీ లైఫ్ కోసం ఎంతకైనా తెగిస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అందులో భాగంగానే లెక్కకు మించిన వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని పోలీసులు గుర్తించారు. అలాగే.. పత్తిపాడుకు చెందిన నగల వ్యాపారి షేక్ అబ్దుల్ రహమెన్ తోనూ వివాహేతర సంబంధం సాగించింది. అతన్ని గట్టిగానే వాడుకుంది. నగలు, డబ్బు రూపంలో మల్లికకు రూ.15 లక్షల వరకు సమర్పించుకున్నాడు. దాని తర్వాత నంబూరుకు మకాం మార్చిన మల్లిక నాగబాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుని రెహమన్ ను దూరం పెట్టింది. నాగబాబుతో దగ్గరగా ఉన్న ఫోటోలు, వీడియోలు రెహమన్ కు పంపించి తన జోలికి రావొద్దని చెప్పింది. ఆ ఫోటోలను చూసిన రెహమన్ రగిలిపోయాడు.

Mahindra BE 6, XEV 9e Prices: మహీంద్రా BE 6, XEV 9e వేరియంట్ల వారీగా ధరలు తెలుకుందామా?

తనతో వివాహేతర సంబంధాన్ని మల్లిక మధ్యలో తెంచేసుకున్నప్పటకీ, ఆమెను వదులుకోలేకపోయాడు. ఎలాగైనా తనను దక్కించుకోవాలని అందుకోసం ఆమెను వశీకరణ చేయాలనుకున్నాడు. ఢిల్లీ నుంచి వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని గాయత్రి అపార్ట్ మెంట్ లో ఉంటున్న మంత్రగాడు.. షేక్ జనాబ్ అహ్మద్ ను సంప్రదించాడు. ఎలాగైనా మల్లిక తనతోనే ఉండేలా చేయమని కోరాడు. అందుకోసం రెహమన్ రూ.3 లక్షలు ఇచ్చాడు. వశీకరణ పూజల కోసం మల్లిక తల వెంట్రుకలు, దుస్తులను షేక్ జనాబ్ అహ్మద్ కు ఇచ్చాడు రెహమన్. పిండితో బొమ్మ తయారు చేసి వశీకరణ పూజలు చేశారు. కాస రసూల్, మానిపాటి స్వప్న కూడా క్షుద్ర పూజల్లో భాగమయ్యారు. అయితే మల్లికను వశపరుచుకునేందుకు చేసిన క్షుద్ర పూజలు ఫలించలేదు. దాంతో కనీసం ఆమె కాళ్లు, చేతులు పడిపోయేలా చేయాలనుకున్న సాధ్యం కాలేదు. ఈ క్రమంలో రెహమన్ కోపం నశాలకు అంటింది. తనకు దక్కని మల్లికను చంపేయాలనుకున్నాడు. మల్లికను చంపే పనిని మాంత్రికుడు షేక్ జనాబ్ అహ్మద్.. అతని అనుచరులు షేక్ రసుల్, మానిపాటి స్వప్నలకు అప్పజెప్పాడు రెహమన్. ఈ ముగ్గురు కలిసి స్కూటీపై 28న మధ్యాహ్నం నంబూరుకు వెళ్లారు. మల్లిక ఇంటిముందు స్కూటీ దగ్గర స్వప్న నిలబడి ఉండగా.. షేక్ జనాబ్ అహ్మద్, కాజా రసూల్ ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో మల్లిక ఇంట్లో ఒంటరిగా ఉంది. నోరు మూసి, గొంతుకు చున్నీతో ఉరి బిగించి మల్లికను చంపేశారు. మృతదేహాన్ని బెడ్ పై పడుకోబెట్టి అందరూ పరారయ్యారు. మల్లిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మల్లిక మాజీ ప్రియుడు షేక్ అబ్దుల్ రెహమన్, మాంత్రికుడు షేక్ జనాబ్ అహ్మద్, అతని అనుచరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మల్లిక దుస్తులు, 40వేల నగదు, స్కూటీ, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.

Show comments