NTV Telugu Site icon

Bird Flu Outbreak: బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. గుంటూరులో చికెన్ అమ్మకాలు మాత్రం..

Bird Flu

Bird Flu

Bird Flu Outbreak: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంలో మాంసానికి దూరంగా ప్రజలు ఉండటంతో.. 75 శాతం చికెన్ అమ్మకాలు పడిపోయాయి. అయితే, గుంటూరులో మాత్రం చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కిలో 170 నుంచి 220 రూపాయల వరకు పలుకుతున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ప్రచారం జరుగుతున్న ధరలు ఏమాత్రం దిగి రావడం లేదని చెప్పాలి.

Read Also: MLA Putta Sudhakar: అవినీతి చేయను.. అవినీతికి పాల్పడితే ఒప్పుకోను!

మరోవైపు చేపలు, మటన్ అమ్మకాలు జోరు అందుకున్నాయి. ఈ క్రమంలో గతంలో కిలో మటన్‌ ధర రూ.700 నుంచి 800కు అమ్మకం చేయగా.. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.100 వరకు పెంచి విక్రయిస్తున్నారు. అలాగే, చేపల రేట్లను కూడా పెంచేశారు. మొన్నటి వరకు రూ.150 నుంచి 160కు అమ్మే బొచ్చ, రవ్వ రకం చేపలను ఏకంగా రూ.200 కేజీగా అమ్మేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలపై ఈ ధరలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.