NTV Telugu Site icon

Prevent Heart Attack: వేకువజాము గుండెపోటుకు బాపట్ల ప్రొఫెసర్ చెక్‌.. పేటెంట్‌ ఇచ్చిన కేంద్రం..

Saikishore

Saikishore

Prevent Heart Attack: గుండెపోటు.. ఇప్పుడు ఇది సర్వ సాధారణంగా వినిపిస్తోంది.. రాత్రి వరకు బాగానే ఉన్నాడు.. తెల్లారేసరికి హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయాడు అనే మాటలు నిత్యం ఎక్కడో ఓ దగ్గర వింటూనే ఉన్నా.. ఇక, హార్ట్‌ ఎటాక్‌కు ఏజ్‌తో సంబంధంలేకుండా.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. అయితే, బాపట్ల ఫార్మసీ కాలేజీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి.సాయికిషోర్ తన విద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన పేటెంట్ మంజూరు చేసింది.. ప్రస్తుత ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులపై డా కిషోర్ సాయి పరిశోధన చేశారు.. సాధారణంగా గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తోంది. దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణమని.. రాత్రి వేళల్లో కొన్ని ప్రత్యేక మెడిసిన్స్ వాడితే తెల్లవారుజామున గుండెపోటు రావనీ, తన పరిశోధనలో తేల్చారు..

Read Also: Allu Arjun : పుష్ప-2 సెన్సార్ రిపోర్ట్ ఇదే.. ఇక థియేటర్స్ లో జాతరే.!

ఇక, ఇప్పటి వరకు తెల్లవారుజామున గుండెపోటు వస్తే ఆ వెంటనే వైద్యం అందడం లేదని ఈ పరిస్థితిని అదిగమించాలన్న ఆలోచనతో పరిశోధకులు ప్రయత్నం చేశారు.. ఈ ప్రతికూలతలను అధిగమించి, గుండె పోటు కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడంపై ఆచార్యుడు సాయి కిషోర్.. రిసెర్చ్‌ స్టూడెంట్స్‌ వంశీకృష్ణ, వాణి ప్రసన్న పరిశోధనలు చేశారు. నాలుగున్నర సంవత్సరాలకు పైగా శ్రమించి, గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతి నిరోధకాలు శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చు అని తెలుసుకున్నారు.. రాత్రి భోజనం తర్వాత 9 గంటలకు ఈ క్యాప్సిల్ వేసుకుంటే, అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతినిరోధకాలను విడుదల చేసి, గుండెపోటు సమర్థవంతంగా అడ్డుకుంటుందని పరిశోధనల ద్వారా నిరూపించారు.. ఈ సంవత్సరం మే నెలలో పేటెంట్స్ కోసం అప్లై చేస్తే.. తాజాగా పేటెంట్స్‌ రైట్స్‌ మంజూరు చేసింది కేంద్రం.. 20 సంవత్సరాలకు పేటెంట్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రొఫెసర్‌ వి.సాయికిషోర్.