Ayesha Meera Case: మంగళగిరి చినకాకానిలోని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శైలజను ఆయేషా మీరా తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషా మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా ఆయేషా మీరా కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం.. 2007 డిసెంబర్ 27వ తేదీన ఆయేషా మీరా హత్య జరిగింది.. 18 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కీలక సాక్ష్యాలు ధ్వంసమయ్యాయని సీబీఐ నివేదికలో పేర్కొంది.. తప్పుడు దర్యాప్తుతో అమాయకుడు సత్యం బాబును కేసులో ఇరికించారు.. తొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబు నిర్దోషిగా విడుదలయ్యాడు అని తెలిపారు.
Read Also: Pakistan: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్! దేశం విడిచి పారిపోతున్న వైద్యులు, ఇంజనీర్లు
ఇక, అమాయకుడు విడుదల కావడమే కాదు, అసలు నేరస్తులకు శిక్ష పడాలన్నదే మా డిమాండ్ అని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషా అన్నారు. మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాల మద్దతుతో న్యాయ పోరాటం చేస్తున్నాం.. 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది.. రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన కీలక సాక్ష్యాలు మాయమయ్యాయి.. నేరస్థులను కాపాడేందుకు ప్రయత్నించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2025 జూన్ 25వ తేదీన సీబీఐ సీల్డ్ కవర్ నివేదిక మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు.
Read Also: Health Effects of Spicy Foods: మిరపకాయలు తినడం మానేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయంటే..
అయితే, ఆయేషా మీరా మరణించిన రోజును సంస్మరణ దినంగా ప్రకటించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఆయేషా మీరా పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మద్దతు తెలిపారు.. నేరస్థులకు శిక్ష పడే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.. ఇప్పుడే ఆయన సీఎంగా ఉన్నారు.. తమకు న్యాయం చేయాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు పేర్కొన్నారు.
