Macherla Crime: మాచర్లలో అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రేణుక కేసు కీలక మలుపు తిరిగింది.. యువతి రాసిన సూసైడ్ లెటర్ బయటపడడంతో.. అసలు విషయం వెలుగు చూసినట్టు అయ్యింది.. సూసైడ్ లెటర్ ఆధారంగా యువతీ ఆత్మహత్యకు కేవలం తల్లిదండ్రులు అనుమానించడమే కారణమని తెలుస్తోంది.. మాచర్లలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న యువతి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నారట.. ఆమె తండ్రి.. రేణుకను ఫోన్ లో తీవ్రంగా మందలించాడని తెలుస్తుంది.. దీంతో యువతి తీవ్ర ఆవేదన చెందినట్టుగా చెబుతున్నారు..
Read Also: MP Fraud: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ బురిడీ.. కేటుగాడు అరెస్ట్
ఇక.. నాన్న, నేను ఎలాంటి తప్పు చేయలేదు.. నీ పరువు తీసే పని చేస్తే, తప్పు చేస్తే, అదే తన చివరి రోజు అవుతుందని చెప్పిన యువతి.. అనవసరపు అనుమానాలతో నా చదువు ఆపితే నేను బ్రతకనని చెప్పిందట.. ఆ తర్వాత తీవ్ర ఆవేదనతో ఊరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.. యువతి రాసిన సూసైడ్ లెటర్‌లో అమ్మ నన్ను క్షమించు, నేను ఏ తప్పు చేయలేదు.. నాన్న నన్ను అనుమానించాడు, నాన్నే నా ధైర్యం.. అలాంటి నాన్నే.. నన్ను అనుమానిస్తే ఇంక నేను బ్రతకడం వ్యర్థం.. అంటూ యువతి రాసిన ఆఖరి మాటలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.