దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మార్పు రావడం లేదు. పట్టపగలే దారుణ హత్యలకు తెగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన సంఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Thopudurthi Prakash Reddy: అజ్ఞాతంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే.. జాడ కోసం పోలీసుల వేట
పేరేచర్ల కొండల్లో బాలకృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బాలకృష్ణ… బంధువులతో కలిసి మద్యం తాగడానికి కొండల్లోకి వెళ్లాడు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. మాట మాట పెరగడంతో అందరూ కలిసి బీరు సీసాలతో బాలకృష్ణపై దాడికి పాల్పడ్డారు. బీరు సీసాలు, రాళ్లతో బాలకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే హత్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతుడు బాలకృష్ణది మంగళగిరిగా పోలీసులు గుర్తించారు. హత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: YS.Jagan: నేడు స్థానిక ప్రతినిధులతో జగన్ భేటీ.. అనంతరం బెంగళూరుకు పయనం
