గుంటూరు జిల్లా రొంపిచర్లలో విషాదం చోటుచేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు నా చావుకు భార్యే కారణం అని లేఖ రాసి ఇంట్లో భర్త ఉరేసుకున్నాడు. రొంపిచర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు(32)కు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతితో వివాహమయ్యింది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఈపూరు స్టేషన్ లో భర్త, అతని బంధువులమీద కేసు పెట్టింది. ఈ క్రమంలో రాత్రి ఇంటికి వచ్చిన రామకృష్ణారావు నా చావుకు కారణం నా భార్య, వారి కుటుంబ సభ్యులని ఉత్తరం రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు అతని కుమారుడి భార్య, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
