NTV Telugu Site icon

Vijayawada Traffic Restrictions: గుణదల మేరిమాత ఉత్సవాలు.. బెజవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Gunadala

Gunadala

Vijayawada Traffic Restrictions: గుణదల మేరిమాత ఉత్సవాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి.. ఈనెల 9, 10,11 తేదీల్లో నిర్వహించనున్న గుణదల మేరీ మాత ఉత్సవాల ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నీ పరిశీలించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.. ఇక, గుణదల మేరీ మాత ఉత్సవాల నేపథ్యంలో.. ఈనెల 9, 10, 11వ తేదీల్లో విజయవాడ సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.. మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా జరిగే కార్యక్రమంలో లక్షలాది సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు..

Read Also: Harirama Jogaiah vs Amarnath: మంత్రి అమర్నాథ్‌కు హరిరామజోగయ్య మరో లేఖ.. రెచ్చగొట్టి లాభపడే ప్రయత్నమే..!

మేరిమాత ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 9 నుండి 12 వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. విజయవాడ నుండి ఏలూరు రోడ్డు మీదుగా వెళ్లే బస్సులను విజయవాడ బస్టాండ్ నుండి స్వర్ణహోటల్ జంక్షన్ క్రీస్తు రాజపురం, మహానాడు జంక్షన్ మీదుగా రామవరప్పాడు నుండి ఆటోనగర్ మీదుగా.. గన్నవరం ఆటోనగర్ నుండి ఏలూరు రోడ్డు మీదుగా బస్ స్టాండ్ కు వచ్చే బస్సులు మళ్లిస్తారు.. గన్నవరం ఆటో నగర్ మీదుగా రామవరప్పాడు నుండి మాచవరా పోలీస్ స్టేషన్ మీదుగా బందర్ లాకులు పిసిఆర్ జంక్షన్ మీదుగా బస్ స్టాండ్ కు మళ్లించనున్నట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, గుణదల మేరిమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం 6 ప్రాంతాలు ఏర్పాటు చేశారు. మధురానగర్ వంతెన వద్ద బిఆర్ టిఎస్ మధ్య రోడ్డు రోడ్డు.. సెయింట్ జోసఫ్ హైస్కూల్ మైదానం, జియాన్ బైబిల్ కాలేజి మైదానం, ఈఎస్ఐ ఆసుపత్రి మైదానం, డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజి మైదానంలో పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు.

Show comments