NTV Telugu Site icon

Crime News: గుంటూరు జిల్లాలో గుజరాత్ కి’లేడీ’లు.. దోపిడీ పక్కా..!!

Guntur District

Guntur District

నయా ప్రపంచంలో అమ్మాయిలు తెలివి మీరారు. గతంలో అయితే మాటలతో మత్తెక్కించి మాయ చేసేవాళ్లు. ఇప్పుడు మోడ్రన్ డ్రస్సులతో అట్రాక్ట్ చేస్తూ అమ్మాయిలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇదే ఫార్ములాను కొంతమంది గుజరాత్ అమ్మాయిలు గుంటూరు జిల్లాలో అమలు చేస్తున్నారు. ఊరు చివరల్లో కాపు కాసి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అడ్డగించి వాళ్ల జేబులకు చిల్లు పెడుతున్నారు.

Loan Apps Harassments: లోన్ యాప్‌ల వేధింపులు.. యువతి బలవన్మరణం

వివరాల్లోకి వెళ్తే.. పెదకాకాని పరిధిలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ వద్ద గుజరాత్ నుంచి వచ్చిన కొందరు అమ్మాయిలు మోడ్రన్ డ్రస్సులు వేసుకుని వాహనదారులను అడ్డగిస్తున్నారు. అమ్మాయిలు పాష్‌గా ఉన్నారని వాహనదారులు వాహనాలను ఆపుతూ వాళ్లు చెప్పే మాటలు విని ట్రాప్‌లో పడిపోతున్నారు. దీంతో గుజరాత్ అమ్మాయిలు పిల్లల కోసం డొనేషన్ పేరిట వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నారు. అయితే బలవంతపు వసూళ్లపై కొంతమంది వాహనదారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా నిఘా ఏర్పాటు చేసి చీటింగ్ చేస్తున్న అమ్మాయిలను పట్టుకున్నారు. ఈ మేరకు 19 మంది అమ్మాయిలను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. గతంలో ఎక్కడెక్కడ ఇలాంటి మోసాలకు పాల్పడ్డారో అమ్మాయిల నుంచి పోలీసులు కూపీ లాగుతున్నారు.