NTV Telugu Site icon

Granules: ఏపీలో మరో భారీ పెట్టుబడి.. కుదిరిన ఒప్పందం

Granules

Granules

ఆంధ్రప్రదేశ్‌లోకు వరుసగా పెట్టుబడులు వస్తున్నాయి.. పెద్ద పెద్ద కంసెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి.. తాజాగా, ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌.. కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.. వచ్చే ఐదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు పేర్కొంది.. వంద ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా ఈ ఫెసిలిటీ కార్యరూపం దాల్చుతుందని చెబుతున్నారు.. ఔషధాల ఉత్పత్తికి కావాల్సిన కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్, ఫెర్మెంటేషన్‌ ఆధారిత ఉత్పత్తులను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు..

Read Also: Boy Missing in Forest: దారితప్పిన ఐదేళ్ల బాలుడు.. రాత్రంతా అడవిలోనే..

మరోవైపు.. గ్రాన్యూల్స్‌ తాజాగా గ్రీన్‌కో జీరోసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉద్గార రహిత విద్యుత్‌ను గ్రీన్‌కో ఈ ప్లాంటుకు సరఫరా చేయనుంది.. ఇక, డీసీడీఏ, పీఏపీ, పారాసీటమాల్, మెట్‌ఫార్మిన్, ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీలో వాడే రసాయనాలను సైతం ఉత్పత్తి చేయి అందించనున్నారు.. ఈ మేరకు ఒప్పందం కుదిరింది.. గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి, గ్రీన్‌కో గ్రూప్‌ ఫౌండర్‌ మహేశ్‌ కొల్లి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.. మొత్తంగా హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా గ్రీన్ మాలిక్యూల్ సొల్యూషన్స్ మరియు ఫార్మాస్యూటికల్స్‌లో వాటి విస్తృత అనువర్తనాలపై సహకరించడానికి గ్రీన్‌కో జీరోసితో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యం పారిశ్రామిక తయారీని సాంకేతికంగా ఉన్నతమైన మరియు గ్రీన్ సొల్యూషన్స్‌తో మరింత స్థిరంగా మరియు పోటీగా మారుస్తుంది అని గ్రీన్‌కో సీఈవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చలమలశెట్టి అన్నారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వరుసగా కంపెనీలు ముందుకు వస్తున్న విషయం విదితమే.