Site icon NTV Telugu

జనసేనతో సర్దుబాటు చేసుకునే పోటీ చేస్తాం : గోరంట్ల బుచ్చయ్య

gorantla-butchaiah-chowdary

gorantla-butchaiah-chowdary

తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఆసక్తి కర కామెంట్స్ చేశారు… వైసీపీ నేతలు సంక్షేమ పథకాల లబ్దిదార్లను ఓట్ల కోసం భయపెట్టారని…. అందుకే పరిషత్ ఎన్నికలను టి.డి.పి బాయ్ కాట్ చేసిందని తెలిపారు. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే టి.డి.పి బలమేంటో చూపిస్తామని… వై.సి.పి ప్రభుత్వ తీరు పై ప్రజా ఉద్యమాల ద్వారా బయటకి వస్తామని వెల్లడించారు. ఎం.పి.పి. స్థానాలకు అవకాశం ఉన్నచోట్ల జనసేనతో సర్దుబాటు చేసుకుంటామని ఆయన తెలిపారు. ఎన్నికలలో కూడా జనసేనతో సర్దుబాటు చేసుకునే స్థానికంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా.. జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ.. ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Exit mobile version