Minister BC Janardhan Reddy: గూగుల్ తో చారిత్రక ఒప్పందం చేసుకోవడంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మార్గ దర్శకత్వంలో యువనేత లోకేష్ కృషితో ఏపీకి గూగుల్ కంపెనీ రావడం అభినందనీయం అన్నారు. అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్టను తిరిగి నిలబెట్టి, పెట్టుబడుల హాబ్ గా ఏపీని తీర్చిదిద్దడంలో నారా లోకేష్ కృషి అనిర్వచనీయం.. చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో కేవలం 15 నెలల కాలంలో.. 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు 6.2 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు పడటం రాష్ట్ర చరిత్రలోనే ఒక కీలక మైలురాయి. ఇక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో గూగుల్ రాక ఒక గేమ్ ఛేంజర్ అని మంత్రి జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Raju Talikote: విషాదం.. షూటింగ్‌లో ఉండగా కన్నడ హాస్యనటుడు హఠాన్మరణం
అయితే, ప్రతిష్టాత్మక గూగుల్ రాకతో.. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల వరద వెల్లువలా వస్తోందని మంత్రి జనార్థన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం కొనసాగుతుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ స్థాయి కంపెనీలు పోటీపడే పరిస్థితి నెలకుంటుంది అన్నారు. ఇక, చంద్రబాబు నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసం గెలుచుకుంటుందని తెలియజేశారు. ఇలాంటి సుస్థిరమైన, నమ్మకమైన ప్రభుత్వం సుధీర్ఘకాలం రాష్ట్రంలో కొనసాగడం ద్వారానే అన్ని వర్గాల్లో నమ్మకం మరింత పెంపొందించగలం అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు.
