Site icon NTV Telugu

Minister Lokesh: గత ఐదేళ్లలో విధ్వంసం.. విశాఖ రూపురేఖలు మార్చనున్న గూగుల్..

Lokesh

Lokesh

Minister Lokesh: విశాఖపట్నానికి ఐటీ దిగ్గజం గూగుల్ రాకపై ఏపీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ రూపురేఖలు మార్చింది.. ఇప్పుడు గూగుల్‌ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయి.. కేవలం డేటా సెంటర్‌ మాత్రమే కాదు.. ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని తెలిపారు. గూగుల్‌ కంపెనీ పెట్టుబడుల వల్ల లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌- 2024లో గూగుల్‌ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యాను.. గూగుల్‌ ప్రతినిధులకు డేటా సెంటర్‌ స్థలాన్ని చూపించాం.. ఇది జరిగిన నెల రోజుల్లో యూఎస్‌కు వెళ్లి గూగుల్‌ క్లౌడ్‌ నాయకత్వాన్ని కలిశాను.. 2024 నవంబర్‌లో గూగుల్‌ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Read Also: Ravi Naik: గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కన్నుమూత.. మోడీ సంతాపం

ఇక, ఇదే అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు అనేక సార్లు సమావేశం అయ్యారు. అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైంది.. భారీ పెట్టుబడులపై అన్నిచోట్ల చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పెట్టుబడుల కోసం 17 నెలలు గా కష్టపడుతున్నాం.. గత ఐదేళ్లలో విధ్వంసం తప్ప.. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు అని ఎద్దేవా చేశారు. అలాగే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే టాప్ టెన్ ఇన్వెస్టర్స్ లిస్ట్ ఎప్పుడూ నా బ్యాగులో ఉంటుంది అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.

Read Also: Smriti Irani – Deepika : నిర్మాతల గురించి కూడా ఆలోచించాలి.. దీపిక పై స్మృతి ఇరానీ షాకింగ్ కామెంట్స్

అయితే, ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం అని మంత్రి లోకేష్ తెలియజేశారు. అనంతపురం, కర్నూలులో పంప్డ్‌ స్టోరేజ్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీలు వస్తున్నాయి.. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఎకో సిస్టంగా తీర్చిదిద్దుతున్నాం.. నెల్లూరు జిల్లా శ్రీసిటీ గ్రేటర్‌ ఎకో సిస్టంలో అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం.. డైకెన్‌, బ్లూస్టార్‌, ఎల్జీ పెట్టుబడులు పెరుగుతున్నాయి.. ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెట్టుబడులు వస్తున్నాయి.. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్‌ తీసుకొస్తున్నాం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం.. ఉత్తరాంధ్రలో టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌ లాంటి సంస్థల పెట్టుబడులు రానున్నాయి. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నామని నారా లోకేష్ వెల్లడించారు.

Exit mobile version