NTV Telugu Site icon

Goods Train Derailed: రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు.. పలు రైళ్లు రద్దు..

Goods Train

Goods Train

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. ఓ వైపు మరమ్మతు పనులు కొనసాగిస్తూనే.. మరోవైపు.. పలు రైళ్లను రద్దుచేసినట్టు ప్రకటించారు అధికారులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రి ఐఎల్టీడీ ప్లైఓవర్ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.. రాజమండ్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.. విజయవాడ – విశాఖపట్నం మధ్య జరిగే తొమ్మిది ప్యాసింజర్ రైళ్లను ఇవాళ రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.. మరో రెండు రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు.. మరోవైపు, గూడ్స్ పట్టాలు తప్పిన రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద పునరుద్ధరణ పనులు చేపట్టారు రైల్వే సిబ్బంది.

Read Also: Earthquake: అర్ధరాత్రి నేపాల్‌, ఢిల్లీని వణికించిన భూకంపం.. ఆరుగురు మృతి

Show comments