Site icon NTV Telugu

కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు శుభవార్త

కరోనాతో ఏపీలో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి.

అలాగే రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై కూడా సీఎం జగన్‌ సమీక్షించారు. ఆస్పత్రుల్లో ఖాళీలపై నియామక క్యాలెండర్‌ను రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. జాతీయ ప్రమాణాల ప్రకారం ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. 176 కొత్త పీహెచ్‌సీల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. కొవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జాబ్‌ ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version