NTV Telugu Site icon

CM YS Jagan: పాడి రైతులకు గుడ్‌న్యూస్‌.. సీఎం చేతుల మీదుగా రూ.7.20 కోట్ల బోనస్‌

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ) పాడి రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ) పాడి రైతులకు బోనస్‌ పంపిణీ చేశారు.. రూ. 7.20 కోట్ల రూపాయల బోనస్‌ చెక్‌ను సీఎంకి అందజేశారు కర్నూలు మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ ఎస్‌.వి. జగన్‌ మోహన్‌ రెడ్డి… పాడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ద వల్ల తమ సహకార సమితి రెండేళ్లలో రూ. 27 కోట్లు లాభాలు గడించిందన్న చైర్మన్, కర్నూలు మిల్క్‌ యూనియన్‌ సమగ్ర పనితీరును వివరించి, రానున్న రోజుల్లో డైరీని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళతామని సీఎంకి వివరించారు.. చైర్మన్, ఎండీ, డైరెక్టర్‌లు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయడైరీ) ఛైర్మన్‌ ఎస్‌వీ జగన్‌మోహన్‌రెడ్డి, ఎండీ పరమేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ రాజేష్‌, సొసైటీ డెరెక్టర్లు జి.విజయసింహారెడ్డి, యు.రమణ, మహిళా పాడి రైతు ఎన్‌. సరళమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read Also: Viral Letter: భార్యను బుజ్జగించుకోవాలి.. లీవ్ ఇవ్వండి.. ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్