వర్షాలు కురిసి గోదావరికి పెద్దమొత్తంలో నీరు చేరితే దిగువున ఉన్న కోనసీమ వరదతో అనేక ఇబ్బందులు పడుతుండేది. వేలాది ఎకరాల పంట వరదనీటికి కొట్టుకుపోయేది. ప్రస్తుతం దిగువ గోదావరిపై పోలవరం డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఈ డ్యామ్ పూర్తికావడానికి కొంత సమయం పడుతుంది. అయితే, పోలవరం వద్ద ప్రస్తుతం కాఫర్ డ్యామ్ ను ఏర్పాటు చేయడంతో వరద ఉధృతి కొంతమేర తగ్గింది. గతంలో రాజమంత్రి తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తేది. కాని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కాఫర్ డ్యామ్ ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం గోదావరి వరద కొంత మేర తగగ్ఇంది. అయితే, కాఫర్ డ్యామ్‌కు ఎగువ ప్రాంతంలో నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో లంకగ్రామాలు నీట మునిగాయి. పాపికొండల ప్రాంతంలో వరదనీరు పోటెత్తింది. పోలవరం నిర్మాణం పూరైతే ధవళేశ్వరం వద్ద నీటీ ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలకు ఇబ్బంది ఉండదు.
Read: మనసున్న మనిషి… సోనూ సూద్!