Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు దక్కాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ ఢిల్లీలో ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. ఏపీలో 80 శాతం హెల్త్ రికార్డులను డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. కోట్లాదిమంది ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను పెంచి వైద్య విద్యను బలోపేతం చేస్తున్నామని ఆమె చెప్పారు. 300కు పైగా ప్రొసీజర్లను చేర్చి ఆరోగ్యశ్రీ కింద బాధితులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి విడుదల రజినీ వెల్లడించారు.
Read Also: Bandla Ganesh: రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన బండ్ల గణేష్.. కారణం అదే!
కాగా తమ ప్రభుత్వం చేస్తున్న ఆరోగ్య సంస్కరణలకు గుర్తింపుగా గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు వచ్చినట్లు మంత్రి విడదల రజినీ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ పరిపాలనకు ఈ గ్లోబల్ అవార్డులనే నిదర్శనమని ఆమె ప్రశంసలు కురిపించారు. కాగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్ రెండు రోజుల పాటు నిర్విహించారు. ఐక్యరాజ్యసమితిలోని ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ ఈ కార్యక్రమానికి సహకారం అందించింది. ఇటీవల భారత్‌లో ప్రారంభించిన 5జీ సేవలు దేశంలోని డిజిటల్ హెల్త్ కేర్ సిస్టమ్‌కు కొత్త విప్లవాన్ని తీసుకువస్తాయని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే భారత్ తనకు ఉన్న అనుకూల అంశాలను ఉపయోగించుకుని డిజిటల్ హెల్త్ లీడర్‌గా మారుతుందని స్పష్టం చేశారు.
