NTV Telugu Site icon

MP Kesineni Chinni: 9 నెలల్లోనే అంతర్జాతీయ టెర్మినల్స్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం..

Keshineni

Keshineni

MP Kesineni Chinni: గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎయిర్ పోర్ట్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ పనులు గత ప్రభుత్వం హయంలో అటకెక్కాయి.. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయకపోవడం దారుణం అని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.

Read Also: Hyderabad Metro: ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో పనులకు శ్రీకారం..

ఇక, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడుతూ.. గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో నిలుపుతామన్నారు. విమానాశ్రయం అభివృద్ధికి అను విధాలుగా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పనులను ఎయిర్ పోర్టుల్లో సందర్శించి సమీక్షించారు.. పనుల్లో జాప్యం ఉంటే కాంట్రాక్టర్లను మార్చాలి.. అంతేగాని గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎయిర్ పోర్ట్ పనులు నిలిపి వేసి చోద్యం చూశారు అని కేంద్రమంత్రి మండిపడ్డారు. మా ఎన్డీయే ప్రభుత్వంలో కేవలం 9 నెలలోనే ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ టెర్మినల్స్ ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ పనులు సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.