ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య కలకలం సృష్టిచింది… దీనికి కారణం వైసీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరే కారణంగా తెలుస్తోంది.. ఇక, గంజిప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేదుకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు ఎదురుతిరిగారు.. మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. చివరకు పోలీసుల రక్షణ వలయంలో ఆయన్ను సురక్షితంగా తరలించారు పోలీసులు.. అయితే, ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై సంచలన ఆరోపణలు చేశారు మృతుడు గంజి ప్రసాద్ భార్య సత్యవతి.
Read Also: Breaking: విశాఖలో తుపాకీతో బెదిరించి బ్యాంకు లూఠీ..
గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమని ఆమె సంచలన ఆరోపణలు చేశారు ఆయన భార్య సత్యవతి.. తనకు అనుకూలంగా ఉన్న వర్గాన్ని ప్రోత్సహించి హత్య చేయించారని పేర్కొన్న ఆమె.. ఎమ్మెల్యే తలారి వెంకట్రావును వెంటనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన భర్త గంజి ప్రసాద్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు.. కుటుంబ పెద్దను కోల్పోయాం.. మా కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు గంజి సత్యవతి.