Site icon NTV Telugu

Andhra Pradesh: మరో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్, హత్య

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్‌రేప్ ఘటన మరువక ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ బతుకుతోంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి ఉండటాన్ని గుర్తించారు. తిరుపతమ్మ మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు గుర్తించారు. దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.

కాగా యువతి మృతదేహాన్ని పోలీసులు తెనాలి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులను పోలీసులు గుర్తించారు. తిరుపతమ్మకు తెలిసినవారే హత్యకు పాల్పడి ఉంటారని గుర్తించారు. సంఘటనాస్థలంలో నిందితులు తాగిపడేసిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అత్యాచారానికి పాల్పడి యువతిని హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం దుగ్గిరాల మండల కమిటీ కార్యదర్శి జెట్టి బాలరాజు, నాయకులు వి.సాంబశివరావు డిమాండ్ చేశారు. హత్యకు ముందు తిరుపతమ్మపట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్లు ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి అర్థమవుతోందని, ఇటువంటి వారిని క్షమించకూడదని వారు డిమాండ్ చేశారు. నిందితులకు కఠినశిక్ష పడేలా చేయడం ద్వారా మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Vishaka: ఆస్పత్రిలో దారుణం.. మైనర్ బాలికపై డాక్టర్ వెకిలి చేష్టలు

Exit mobile version