Site icon NTV Telugu

Gajendra Singh Shekhawat AP Tour: పోలవరం సందర్శనకు షెకావత్..

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రేపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. రేపు సాయంత్రం 7.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నివాసానికి రానున్నారు కేంద్ర మంత్రి షెకావత్… ఆయనకు రాత్రి విందు ఇవ్వనున్నారు ఏపీ సీఎం.. ఇక, మార్చి 4వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టులోని నిర్వాసిత కాలనీలు, ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద పీపీఏ, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు గజేంద్ర సింగ్‌ షెకావత్‌… ఆ తర్వాత పోలవరం పర్యటనను ముగించుకుని విజయవాడలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు ఈ ప్రాజెక్టును సందర్శించారు.

Read Also: Minister Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర..

Exit mobile version