రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైయస్సార్‌సీపీని కోరాం అన్నారు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్. మా పార్టీ అగ్రనేతలంతా దీనిపై ఏపీ సీఎం వైయస్ జగన్‌తో స్వయంగా మాట్లాడారని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ఎంపిక చేసుకున్న తర్వాత, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు, అన్ని ముఖ్య పార్టీల నేతలతో మాట్లాడాం. ఆ క్రమంలోనే వైయస్సార్‌సీపీని సంప్రదించడం జరిగిందని వివరణ ఇచ్చారు.
Operation Kamal: ఎమ్మెల్యేలకు బంపరాఫర్.. బీజేపీలో చేరితే రూ. 50 కోట్లు
ఆ మేరకు ఏపీ సీఎ వైయస్ జగన్‌తో మా పార్టీ అగ్రనేతలంతా స్వయంగా మాట్లాడారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎవరి మద్దతు కోరలేదని మా పార్టీ ప్రతినిధి అన్నట్లు, పత్రికల్లో వచ్చింది. అయితే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చు. ఆ ప్రకటనతో బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదన్నారు. సత్యకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సత్యకుమార్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. సత్యకుమార్ వ్యాఖ్యలను ఖండించింది బీజేపీ అధిష్టానం.
రాష్ట్రపతి ఎన్నికలో వైయస్సార్‌సీపీ మద్దతు కోరలేదంటూ సత్యకుమార్‌చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో బీజేపీ అధిష్టానం వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపిందని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నామినేషన్ దాఖలు సమయంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కూడా హాజరై మద్దతు తెలిపారని వివరణ ఇచ్చారు.
Talasani Srinivas Yadav : కొంచెం బుద్ధి, జ్ఞానంతో బండి సంజయ్ మాట్లాడాలి