కేంద్రానికి నిధులు రాష్ట్రాల నుంచే వెళ్తాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 2014-19 మధ్య రాష్ట్రం చీకటి పాలనను చూసిందన్నారు. బండ మా మీద వేయటానికి ప్రయత్నించటం మాకే మంచిది అయిందని ఆయన అన్నారు. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పే అవకాశం వచ్చిందన్నారు. కేంద్రం పెట్రోల్ పై 3.౩5 లక్షల కోట్లు వసూలు చేసింది. వీటిలో రాష్ట్రాలకు పంచింది కేవలం రూ.19,475 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు.
సర్ ఛార్జీలు, సెస్సుల రూపంలో కేంద్రం వసూలు చేసిందంతా కేంద్రం తన ఖాతాలో వేసుకుందన్నారు. డివిజబుల్ ఇన్ కమ్ తగ్గిం చి…రాష్ట్రాలకు పంచాల్సిన తన వాటాను ఇంతవరకు పంచలేదన్నా రు. కేంద్రం పెట్రోల్ రేట్ల తగ్గింపు డిస్కౌంట్ సేల్ లాగా ఉంద ని ఆయన విమర్శించారు. కేంద్రం చేసిన అప్పు డీజీపీలో 60% వరకు ఉందని సజ్జల అన్నారు.
