వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగంపుపై ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతోంది.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.. దీనిపై ఇవాళ కీలక ప్రకటన చేశారు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తామని వెల్లడించారు.. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పగటి పూటే 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన.. అనంతపురం జిల్లాలో తమకు రాత్రిపూట కరెంట్ ఇవ్వాలని అక్కడి రైతులు కోరారని.. వారి విజ్ఞప్తికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.. ఇక, విద్యుత్ ఉద్యోగులకు జీతాల్లో ఎలాంటి కోత ఉండదని స్పష్టం చేవారు మంత్రి బాలినేని… 2018 పీఆర్సీ మేరకు విద్యుత్ ఉద్యోగుల జీతాలు ఉంటాయన్న ఆయన.. కరోనాతో చనిపోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబీకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. విద్యుత్ సంస్థలకు రూ. 80 వేల కోట్ల మేర అప్పులు పెండింగ్‌లో పెట్టింది గత ప్రభుత్వం అని విమర్శించిన బాలినేని.. పెండింగ్ అప్పులను తీర్చేందుకు సీఎం చాలా కృషి చేస్తున్నారని తెలిపారు.
త్వరలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు..
Balineni Srinivas Reddy